World Bank: భారత్ కు ప్రపంచ బ్యాంకు షాకింగ్ న్యూస్.. ఇండియా ధనిక దేశంగా మారాలంటే..?
- 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది లక్ష్యం
- కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడి
- ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాకింగ్ న్యూస్ తెలిపిన వరల్డ్ బ్యాంక్
- భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 7 దశాబ్ధాలు పడుతుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు పెద్ద షాక్‌గా ఉంటుంది. భారతదేశం, ప్రపంచంలోని అనేక దేశాలు సంపన్నులు కావడానికి సంవత్సరాలు పట్టవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారత్ లాంటి దేశం సంపన్నంగా మారడానికి 7 దశాబ్దాలకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది.
READ MORE:Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..
Also Read
చైనాకు 10 ఏళ్లు, భారత్‌కు 75 ఏళ్లు..
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాలలో అధిక ఆదాయ దేశంగా మారడానికి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటాయి. భారతదేశం, యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టవచ్చు. ప్రపంచ బ్యాంకు ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024: మిడిల్ ఇన్కమ్ ట్రాప్’ ప్రకారం.. యూఎస్ తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి చైనాకు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇండోనేషియాకు దాదాపు 70 సంవత్సరాలు పడుతుంది. ఈ నివేదిక గత 50 సంవత్సరాల అనుభవం ఆధారంగా రూపొందించినట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది.
READ MORE:Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..
ప్రపంచంలోని ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదవారు..
2023 చివరి నాటికి, ప్రపంచ బ్యాంక్ 108 దేశాలను మధ్య ఆదాయ సమూహంగా వర్గీకరించింది. వారి తలసరి వార్షిక GDP యూఎస్$1,136 నుంచి యూఎస్$13,845 వరకు ఉంది. ప్రపంచ జనాభాలో 75 శాతం ఉన్న ఈ దేశాలలో ఆరు బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు.
READ MORE:Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారు?
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అనేక మధ్య-ఆదాయ దేశాలు ఇప్పటికీ గత శతాబ్దపు వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను పెంచడానికి రూపొందించిన విధానాలపై ఆధారపడుతున్నాయి. ఫస్ట్ గేర్‌లో పెట్టి కారును వేగంగా నడపడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ దేశాలు పాత వ్యూహానికి కట్టుబడి ఉంటే, ఈ మధ్య నాటికి సంపన్న సమాజాలను నిర్మించే రేసులో ఈ దేశాలు చాలా వరకు వెనుకబడిపోతాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇందర్మీత్ గిల్ అన్నారు.
తాజావార్తలు
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!