Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Protest: రాష్ట్రవ్యాప్తంగా నేడు (శుక్రవారం) విద్యా సంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU తదితర విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ.. విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాయి. VBSA బిల్లును వెనక్కి తీసుకోవడంతో పాటు, NEET పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస వైఫల్యాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
Also Read
విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు ఇప్పటికే బంద్ ప్రకటించడంతో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. బంద్‌లో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!