Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..
- పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..
- వివాహాలను పెంచడమే లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Degree in marriage: చైనాలో రోజురోజుకి జననాల సంఖ్య తగ్గుతోంది. అక్కడి యువత పెళ్లిళ్లపై మొగ్గు చూపకపోవడం, పిల్లల్ని కనాలనే ఇంట్రస్ట్ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. అయితే, యువత పెళ్లిళ్ల వైపు దృష్టిసారించేలా అక్కడి ప్రభుత్వం అనేక ప్రోత్సహకాలను కూడా ప్రకటించింది. ఇదిలా ఉంటే చైనాలోని ఓ యూనివర్సిటీ వివాహాలపై ఏకంగా ఓ డిగ్రీ కోర్సునే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. వివాహ-సంబంధిత పరిశ్రమలు మరియు సంస్కృతిని అభివృద్ధి చేయడానికి చైనా సివిల్ ఎఫైర్స్ యూనివర్సిటీ ఒక కొత్త అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుని ప్రవేశపెట్టింది.
సెప్టెంబర్ నెల నుంచి ఈ కోర్సు ప్రారంభం కానున్నందున, వివాహ సంబంధిత పరిశ్రమను అభివృద్ధి చేయడానికి నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. 2023లో చైనా జనాభా పరంగా వరసగా రెండో ఏడాది కూడా కొత్త జననాల సంఖ్య పడిపోయింది. వివాహాల రేటులో జననాల సంఖ్యకు సంబంధం ఉండటంతో అక్కడి ప్రభుత్వ యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.
Also Read
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
Read Also: Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..
మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్‌మెంట్ అని పిలవబడే, కొత్త డిగ్రీ వివాహాలపై దాని అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెడుతుంది. చైనాలో వివాహాలు, కుటుంబ సంస్కృతిని విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడం, చైనా వివాహ ఆచారాల సంస్కరణల్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
అయితే, ఈ నిర్ణయంపై చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ విబోలో యూజర్లు సెటైర్లు వేస్తున్నారు. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని వివాహ ఏజెన్సీని ప్రారంభించిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి డిగ్రీలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం కూడా యువత పెళ్లిళ్ల వైపు మొగ్గు చూపకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.
- Tags
- china
- Degree in marriage
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!