Womens World Cup 2025 Final: 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్‌కు కొత్త ఛాంపియన్ కానుంది. ఉత్కంఠభరితంగా మారిన ఈ టోర్నమెంట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. భారత జట్టుకు ఇది మూడో ఫైనల్ కాగా, దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి ప్రపంచ కప్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి.
Australia vs India 3rd T20I: టిమ్ డేవిడ్, స్టోయినిస్ దూకుడు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..!
అయితే, క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఏమిటంటే.. నవీ ముంబైలో వర్షం కారణంగా టాస్‌లో ఆలస్యం జరిగింది. వాస్తవానికి మధ్యాహ్నం 2:30 గంటలకు టాస్ జరగాల్సి ఉండగా, వర్షం వల్ల అది 3 గంటలకు వాయిదా పడింది. అయితే తాజాగా 3 గంటలకు కూడా టాస్ జరగలేదు. దీంతో మ్యాచ్ ప్రారంభంలో మరింత ఆలస్యం అవుతోంది. వర్షం ముప్పు ఉన్నప్పటికీ, ఈ ముఖ్యమైన ఫైనల్ కోసం ఐసీసీ రిజర్వ్ డే (Reserve Day)ను కేటాయించింది. ఒకవేళ నేడు (నవంబర్ 2) మ్యాచ్ పూర్తి కాకపోతే నవంబర్ 3న కొనసాగించే అవకాశం ఉంది.
కాంపాక్ట్ డిజైన్, 7000mAh బ్యాటరీ, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో రాబోతున్న OnePlus 15T..!
ఈ ఫైనల్ మ్యాచ్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందనుంది. ఎందుకంటే 52 ఏళ్ల మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌లో లేవు. దీనితో 25 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌కు కొత్త విజేత దక్కడం ఖాయమైంది. భారత జట్టు టోర్నమెంట్‌ను బాగా ప్రారంభించినప్పటికీ, మధ్యలో కొన్ని పరాజయాలను చవిచూసింది. అయినప్పటికీ, పుంజుకుని 3 విజయాలతో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు 2005, 2017లో ఫైనల్స్ ఆడిన భారత్, ఆ రెండు సార్లు ఓటమి పాలైంది. ఈసారి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక మరోవైపు దక్షిణాఫ్రికా ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినా.. ఆ తర్వాత పుంజుకుని 5 మ్యాచ్‌లు గెలిచి సెమీ-ఫైనల్‌లో స్థానం సంపాదించింది.