OnePlus 15T: వన్‌ప్లస్ నుండి రాబోయే కొత్త మోడల్ వన్‌ప్లస్ 15T (OnePlus 15T) గురించి గత కొద్ది రోజులుగా అనేక లీక్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మరికొన్ని ఫీచర్స్, లాంచ్ తేదీ గురించి వివరాలు ఆన్‌లైన్‌లో వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 13T తర్వాత రానున్న ఈ మోడల్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. హార్డ్‌వేర్ పరంగా చెప్పుకోదగిన అప్డేట్స్ ను అందిస్తుందని అంచనా.
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి ఎలక్ట్రిక్ 7-సీటర్ లాంచ్‌కు సిద్ధం..
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Digital Chat Station) వీబో పోస్ట్ (Weibo post) ప్రకారం.. వన్‌ప్లస్ 15T స్మార్ట్‌ఫోన్ 2026 ప్రథమార్థంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన తర్వాత స్వల్ప మార్పులతో ఇది భారతదేశానికి వన్‌ప్లస్ 15sగా రానుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే, వన్‌ప్లస్ 15T 6.31 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఇది 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం డిస్‌ప్లే కింద అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది.
India vs South Africa: మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌కు వానగండం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి..?
ఈ కొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) చిప్‌సెట్‌తో పనిచేయనున్నట్లు టిప్‌స్టర్ పేర్కొన్నారు. బ్యాటరీ సామర్థ్యం ఇంకా ఖరారు కానప్పటికీ టెస్టింగ్ దశలో ఉన్న ఇంజనీరింగ్ ప్రొటోటైప్ మోడల్ నంబర్ ‘7’ తో ప్రారంభమవుతుందని టిప్‌స్టర్ తెలిపారు. దీనిని బట్టి ఇందులో సుమారు 7,000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 15 లో 7,300mAh బ్యాటరీ ఉంది. కాంపాక్ట్ డిజైన్‌కు అనుగుణంగా 15T లో స్వల్పంగా చిన్న బ్యాటరీని ఆశించవచ్చు. ఇదిలా ఉండగా.. వన్‌ప్లస్ ప్రధాన ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన వన్‌ప్లస్ 15 భారతదేశంలో నవంబర్ 13న విడుదల కావడం ఖాయమైంది. వన్‌ప్లస్ 15T కెమెరా వివరాలను టిప్‌స్టర్ పంచుకోనప్పటికీ.. కొన్ని నివేదికల ప్రకారం ఇందులో అల్ట్రావైడ్ కెమెరా కూడా చేర్చబడుతుందని సమాచారం. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టనున్న ఈ కొత్త మోడల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.