Womens T20 World Cup 2026 Schedule: 2026లో జరగబోయే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ జూన్ 12, 2026న ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్, వేల్స్ లలోని ఆరు ప్రఖ్యాత స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఒపెనింగ్ మ్యాచ్ జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ – శ్రీలంక మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పోటీ పడతాయి. రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూపులో 6 జట్లు ఉండనున్నాయి. ప్రతి గ్రూప్ లో 2 క్వాలిఫైయింగ్ జట్లు ఉండేలా వీటిని విభజించారు.
ఇక గ్రూప్‌లు ఏవిధంగా ఉన్నాయన్న విషయానికి వస్తే.. గ్రూప్ 1 లో భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 లు ఉండగా, గ్రూప్ 2లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, క్వాలిఫయర్ 3, క్వాలిఫయర్ 4 జట్లు ఉండనున్నాయి. భారత్ ఈ టోర్నమెంట్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రారంభిస్తుంది. టీ20 ఫార్మాట్‌లో భారత్ పాకిస్తాన్‌పై పటిష్ఠమైన రికార్డు కలిగి ఉంది. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌లలో 12 సార్లు భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్ చివరిసారిగా 2022 మహిళల ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించింది. న్యూజిలాండ్ ఈ టోర్నీకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. గ్రూప్ 2లో ప్రధాన బలంగా నిలుస్తుంది. మరోవైపు హోమ్ గ్రౌండ్ మీద ఆడే ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగా కనిపిస్తోంది.
Read Also: Joe Root: ‘బజ్‌బాల్’ సరికాదేమో.. ఇండియా సిరీస్‌కు ముందు జో రూట్ కీలక వ్యాఖ్యలు..!
ఇండియా గ్రూప్‌లో పాకిస్తాన్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి టాప్ జట్లతో పోటీపడాల్సి ఉంటుంది. ఇది టీమ్ ఇండియా కు పెద్ద సవాలుగా మారుతుంది. ఇక ఈ సిరీస్ లో భారత్ మ్యాచులు విషయానికి వస్తే.. జూన్ 14 న భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ లో, జూన్ 21న దక్షిణాఫ్రికా vs భారత్ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో, జూన్ 28న భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ లార్డ్స్ లో జరగనున్నాయి. ఆ తర్వాత జూన్ 30, జూలై 2న సెమీ ఫైనల్స్ ది ఓవల్ లో, జూలై 5న ఫైనల్ లార్డ్స్ వేదికగా జరగనుంది.
Mark your calendars 🗓
The fixtures for the ICC Women’s T20 World Cup 2026 are out 😍
Full details ➡ https://t.co/X2BqQphwSC pic.twitter.com/gqkxaMudEP
— ICC (@ICC) June 18, 2025