ఈరోజుల్లో పురుషుల కన్నా కూడా మహిళలు ఎక్కువగా వ్యాపారాల్లో రానిస్తూ కళ్లు చెదిరే లాభాల ను పొందుతూన్నారు.. వ్యవసాయం కూడా చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మహిళా రైతులు కూడా వ్యవసాయంలో తమ వంతుగా రాణిస్తున్నారు. మహిళలు కూడా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిస్‌నగర్ జిల్లా మహుడా గ్రామానికి చెందిన సులేఖా దేవి అనే మహిళా రైతు కథ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఈమె రూ .40 వేల కు భూమిని కొనుగోలు చేసి కూరగాయల సాగు చేపట్టారు. ఇప్పుడు ఆమె వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అర్జిస్తుంది.. ఇంతకు ముందు ఆమె ఇతరుల పొలంలో పనులకు వెళ్లేదని సమాచారం.. అక్కడ సాగు చేస్తున్న పంటలను తానే స్వయంగా వ్యవసాయం చెయ్యాలని అనుకుంది.. అదే విధంగా పట్టుబట్టి భూమిని కొనుగోలు చేసింది.. 40 వేలు 4 కథల (0.1250 ఎకరాలు) భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిలో అతను పొలంలో కొన్ని పంటలను పండించింది..
బెండకాయ కాపుకు వచ్చిన మొదటి వారం నుండే మా పొలంలో బెండకాయల కోత మొదలైంది. కానీ మార్కెట్‌లో దీని ధర చాలా తక్కువ. ప్రతి 2- 3 రోజులకు 1 నుండి 2 క్వింటాళ్ల బెండ పండుతుంది. ఈ సమయంలో 15-20 కిలోల బెండకాయ ఉత్పత్తి అవుతుంది, ఇది నెలలో సుమారు 70 వేల రూపాయల లాభం ఇస్తుంది.. ఈమె బెండకాయల కు మార్కెట్ లో డిమాండ్ ఏర్పడింది.. ఫ్రెష్ కూరగాయలను కొనడానికి అక్కడి వారు వస్తున్నారు. ప్రస్తుతం బెండకాయ తో మంచి లాభాలు వస్తున్నట్లు ఆమె తెలిపింది.. ఈమె బెండి సాగు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫెమస్ అయ్యింది..