Honour Killing: తాగుదామని పిలిపించి అల్లుడిని చంపేసిన కుటుంబం.. సంచలనంగా ‘‘పరువు హత్య’’
- సంచలనంగా మారిన పరువు హత్య..
- నమ్మించి అల్లుడిని చంపేసి కుటుంబం..
- 5 ఏళ్ల క్రితం ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న యువతి..
- కక్షతో ఇంటికి ఆహ్వానించి అల్లుడి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour Killing: గ్రేటర్ నోయిడాలో ఇటీవల జరిగిన హత్య గుట్టు వీడింది. ఈ హత్యను ‘‘పరువు హత్య’’గా పోలీసులు తేల్చారు. తమ ఇష్టానికి విరుద్ధంగా కూతురు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కక్ష పెంచుకున్న కుటుంబం అల్లుడిని దారుణంగా హతమార్చింది. నమ్మించి చంపేసింది. తాగుతామని ఇంటికి పిలిపించి, వ్యక్తిని చంపేశారు. చంపేందుకు మనుషులను ఏర్పాటు చేసుకునేందుకు సదరు కుటుంబం రూ. 3 లక్షలకు బంగారాన్ని తాకట్టు పెట్టింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, మహిళ తండ్రి, మామతో పాటు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
జోన్ 2 డీసీపీ సునీతి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 16న ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగమ్ విహార్ కాలనీ సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. చనిపోయిన వ్యక్తిని భూలేష్ కుమార్‌గా గుర్తించారు. ఇతను ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నివాసి. ఈ హత్య తర్వాత భూలేష్ కుటుంబం అతని భార్య ప్రీతి యాదవ్ తండ్రి బుద్ సింగ్ యాదవ్, సోదరులు ముఖేష్ యాదవ్, స్నేహితుడు శ్రీపాల్ యాదవ్‌పై కేసు పెట్టారు. ఐదేళ్ల క్రితం భూషేష్, ప్రీతి పెళ్లి చేసుకున్నారు. ప్రీతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా పారిపోయి భూలేష్‌ని వివాహం చేసుకుంది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Read Also: Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో మేం కలిసి పోరాడుతాం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
అయితే, ఈ వివాహం జరిగి 5 ఏళ్ల తర్వాత అంతా కలిసిపోదామని మాయమాటలు చెప్పిన ప్రీతి కుటుంబం అల్లుడు భూలేష్‌ని ఇంటికి రావాలని కోరింది. తాగుదామని, విందు చేసుకుందామని ప్రీతి కుటుంబం నమ్మించింది. ఈ నేపథ్యంలో అత్తామామ ఇంటికి వెళ్తుండగా, అతని భార్య తండ్రి, మామ నియమించుకున్న కాంట్రాక్ట్ కిల్లర్స్ భూలేష్ గొంతు నులిమి చంపారు. విచారణలో ప్రీతి తండ్రి బుద్ధ్ సింగ్ యాదవ్ మరియు మామ ఖరక్ సింగ్ కుట్ర చేసి భూలేష్‌ను చంపడానికి వారి పొరుగు గ్రామమైన మండోలికి చెందిన నలుగురు అబ్బాయిలను నియమించుకున్నారని తేలింది.
నలుగురు నిందితులు అవధేష్, నీరజ్ యాదవ్, యశ్పాల్ మరియు టిటు నోయిడాకు వచ్చి భూలేష్‌ను గొంతు కోసి అతని ఆటోరిక్షాను తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. నేరానికి సంబంధించి ఉపయోగించిన వాహనం, గొంతు నులిమి చంపడానికి ఉపయోగించిన టవల్, హత్యకు బదులుగా పొందిన నగలు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సునీతి తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!