Site icon NTV Telugu

Medchal: మేడ్చల్‌లో దారుణం.. బ్యాగులో మహిళ మృతదేహం..

Medchal3

Medchal3

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ తో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ హస్పెటల్ కు తరలించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. మృతురాలి ఆచూకీ, హత్య చేసిన వారి వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నారు.

READ MORE: Telegram Update: డైరెక్ట్ మెసేజ్‌లు, వాయిస్ ట్రిమ్మింగ్, HD ఫోటోలు లాంటి మరెన్నో అప్డేట్స్‌ను తీసుకొచ్చిన టెలిగ్రామ్..!

Exit mobile version