Telegram Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తాజాగా విడుదల చేసిన v11.12.0 అప్డేట్ లో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్డేట్ ద్వారా చానెల్ యాజమానులకు డైరెక్ట్ మెసేజ్‌లు పంపే సదుపాయం, వాయిస్ మెసేజ్ ట్రిమ్మింగ్, హై డెఫినిషన్ ఫోటో పంపే అవకాశం వంటి ఎన్నో కొత్త మార్పులు కలవు. మరి కొత్తగా వచ్చిన ఏ ఫీచర్స్ వచ్చాయి..? వాటిని ఎలా వాడాలో ఒకసారి చూద్దామా..
చానెల్‌కు డైరెక్ట్ మెసేజ్‌లు:
ఇప్పటి నుంచీ యూజర్లు చానెల్ అడ్మిన్స్ కి లేదా ఓనర్స్ కి ప్రైవేట్ మెసేజ్‌లు పంపవచ్చు. మొబైల్ నెంబర్ షేర్ చేయకుండానే ఈ కమ్యూనికేషన్ జరగడం వల్ల ప్రైవసీ పరంగా ఇది చాలా ప్రయోజనకరం. అడ్మిన్స్ కి వచ్చిన మెసేజ్ లు ఒక ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌లో కనబడతాయి. దీంతో వాటిని వ్యక్తిగత చాట్స్‌తో కలపరు. చానెల్ లోని మెసేజ్ బబుల్ ఐకాన్ పై టాప్ చేసి డైరెక్ట్ మెసేజ్ పంపవచ్చు. ఇందుకోసం Channel Settings లో Direct Messages ఆప్షన్ వద్ద ఎనేబుల్ చేయాలి.
Read Also: Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
గ్రూప్ టాపిక్స్‌కి ట్యాబ్ లేఅవుట్:
గ్రూప్ చర్చలు ఇంకా సులభంగా నిర్వహించేందుకు ట్యాబ్ ఇంటర్‌ఫేస్ అందుబాటులోకి వచ్చింది. సైడ్ బార్ లేదా టాప్ బార్ ద్వారా టాపిక్స్ మధ్య చాలా స్పీడ్ గా స్విచ్ అవ్వచ్చు. ఇందుకోసం Group Settings లోని Topicsలో ఈ ఫీచర్ యాక్టివేట్ చేయవచ్చు.
వాయిస్ మెసేజ్ ట్రిమ్మింగ్:
వాయిస్ మెసేజ్ రికార్డింగ్ పూర్తయిన తర్వాత అవసరంలేని భాగాలను తొలగించవచ్చు. ఒకవేళ చిన్న తప్పిదం జరిగితే మళ్లీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మొదటి, చివరి భాగాలను కట్ చేసి పంపొచ్చు. రికార్డింగ్ సమయంలో స్వైప్ అప్ చేసి లాక్ చేసిన తర్వాత ట్రిమ్మింగ్ ఆప్షన్ యాక్టివ్ అవుతుంది. మైక్రోఫోన్ ను మళ్లీ టాప్ చేస్తే మరిన్ని సెగ్మెంట్లు కూడా జోడించవచ్చు. వాయిస్, వీడియో రెండింటినీ పాజ్ చేసి తిరిగి ప్రారంభించడాన్ని కూడా ఈ అప్డేట్ మద్దతు ఇస్తుంది.
Read Also: Vaibhav Suryavanshi: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. కారు గెలిచాడు కానీ.. మరో నాలుగేళ్లు..?
హై డెఫినిషన్ ఫోటోలు:
ఇప్పుడు టెలిగ్రామ్‌లో ఫోటోలు హై క్వాలిటీ (HD) లో పంపవచ్చు. సాధారణంగా కంటే నాలుగు రెట్లు ఎక్కువ పిక్సెల్ క్వాలిటీ అందుతుండగా, ఫైల్ సైజు 0.5MBకి లోపే ఉంటుంది. ఫోటో ఎడిటర్లో SD బటన్‌ను టాప్ చేసి HDకి మార్చవచ్చు. లేదా Attachment menu కు వెళ్లి అక్కడ Send in High Quality ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఐఓఎస్‌లో స్టోరీస్‌కి డైరెక్ట్ షేర్:
ఐఫోన్ యూజర్లకు ఇకపై ఫొటోస్ అప్ లాంటి వాటి నుండి Telegram Storiesకి డైరెక్ట్‌గా షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌కి iOS system share sheet ద్వారా మద్దతు ఉంది.
పొల్స్‌లో 12 ఆప్షన్స్:
ఇప్పుడు Telegram pollsలో గరిష్టంగా 12 ఆప్షన్లు ఇవ్వొచ్చు. అంతేకాదు, Saved Messagesకి forward చేయడం ద్వారా రిజల్ట్స్ ని భద్రపరచొచ్చు. లేదా ఇతర చాట్స్ కి కూడా షేర్ చేయవచ్చు.
ఈ అప్డేట్స్ ప్రస్తుతం iOS, ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారమ్‌లపై v11.12.0 లేదా అంతకన్నా తాజా వెర్షన్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు దీన్ని telegram.org/android లేదా Google Play Store ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్‌తో టెలిగ్రామ్ యూజర్ అనుభవం మరింత సమర్థవంతంగా, ప్రైవసీతో కూడినదిగా మారనుంది.