Nizamabad: నిజామాబాద్ జిల్లా మిట్టాపూర్‌లో జరిగిన మహిళ దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 12 టీంలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మహిళ శవం లభ్యమంటూ పోలీసులు పోస్టర్లు అతికించారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లు ముద్రించారు. వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం అదించారు. మిస్సింగ్ కేసులు నమోదైతే సమాచారం ఇవ్వాలంటూ నవీపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.