మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.