దేశాన్ని చుట్టిరావాలనే కోరికా చాలా మందిలో ఉంటుంది. అది అమ్మాయిలు అయినా.. అబ్బాయిలు అయినా కావచ్చు. చేతిలో కొంచెం డబ్బు ఉంటే అబ్బాయిలు తమ కోరికలను తీర్చుకోగలరు.. కానీ అమ్మాయిలు అలా కాదు.. అమ్మాయిలు ఒంటరిగా బటయకు అడుగుపెట్టాలి అంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. వారికి ఏదైనా జరగకూడనిది జరుగుతుందేమో అని భయపడుతుంటారు. అయితే ఎలాంటి భయం లేకుండా భారతదేశంలోని కొన్ని పర్యటక ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణించవచ్చు.. ఈ ప్రదేశాలలో మహిళలు సురక్షితంగా ఉంటారు..
Also Read : Pak Twitter Account: పాక్‌కు షాక్.. భారత్‌లో అధికారిక ట్విట్టర్ ఖాతా బ్లాక్
జైసల్మేర్ : భారతదేశంలోని అత్యంత ప్రసిద్ద పర్యాటక ప్రదేశాలలో రాజస్థాన్ ఒకటి. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ రాష్ట్రంలో చారిత్రక కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, సరస్సులను ఇక్కడ చూడవచ్చు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో మహిళలు సురక్షితంగా తిరగవచ్చు. దీనిని గోల్డెన్ సిటీ అంటారు. జైసల్మేర్ లో మహిళలు తిరిగేందుకు చాలా స్థలాలు, అనేక కార్యకలాపాలు, స్థానిక మార్కెట్ లు షాపింగ్ చేయడానికి అనువైనది.
Also Read : Sri Rama Navami 2023 Special: ఈ రోజు ఈ స్తోత్రాలు వింటే ఎటువంటి కష్టాలు మీ దరి చేరవు..
ముస్సోరీ హిల్ : ఉత్తరాఖండ్ లోని ముస్సోరీకి మహిళలు కూడా ఒంటరిగా ప్రయాణించవచ్చు. మీరు డెహ్రాడూన్ నుంచి బస్సు లేదా టాక్సీలో ముస్సోరీకి చేరుకోచచ్చు. అక్కడ హోటల్ లేదా గదిని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మహిళలు ఎలాంటి భయం లేకుండా సంచరించవచ్చు. ఇక్కడి మీరు కాంప్టి జలపాతం, దలై హిల్స్. మాల్ రోడ్. ధలౌటి మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు. తక్కువ ఖర్చుతో రెండు రోజుల పర్యటన చేయవచ్చు.
Also Read : Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సీఎం కావాలి..
వారణాసి : హిందువులకు పవిత్ర స్థలం వారణాసి, ఉత్తరప్రదేశ్ లోని పురాతన నగరం. ఇక్కడ గంగా నది చూడటం ఖచ్చితంగా పూర్వ జన్మ పుణ్యం. ఇక్కడ బోటింగ్ కూడా చేయవచ్చు. కాశీ విశ్వనాథుని దర్శనం కూడా పొందవచ్చు. ఒంటరిగా ప్రయాణించాలనుకునే మహిళలకు ఈ ఆకర్షణ అనువైనది.
Also Read : Sri Ramachandruni Stotra Parayanam: శ్రీరామనవమి సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే చాలు..
నైనిటాల్ : ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, హిల్ స్టేషన్ లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గం. ట్రెక్కింగ్, బోటింగ్, షాపింగ్ చేయడానికి ఇది అనువై ప్రదేశం. నైని సరస్సు, నైనా దేవి ఆలయం, జూ కూడా ఇక్కడ చూడవచ్చు. దేశంలో ప్రసిద్ద హిల్ స్టేషన్ల జాబితాలో నైనిటాల్ ను చేర్చారు. చాలా మంది పర్యాటకులు శీతాకాలం, వేసవికాలం నైనిటాల్ ను సందర్శిస్తారు. ఒంటరిగా వెళ్లాలనుకునే మహిళలు బస్సు లేదా ట్రైన్ లో నైనిటాల్ చేరుకోవచ్చు. నైనిటాల్ చేరుకున్న తర్వాత, మహిళలు నిర్భయంగా అక్కడి నగరాల్లో తిరగవచ్చు.