వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2023 పోటీల సందర్భంగా ఆటగాళ్లు, ప్రేక్షకులకు టోర్నమెంట్ నిర్వహణ అధికారులు హెచ్చరికలు చేశారు.వింబుల్డన్ 2023 ఈవెంట్ సందర్భంగా ప్రార్థనల కోసం కేటాయించిన గదిలో కొన్ని జంటలు శృంగారం చేస్తున్నారని వింబుల్డన్ నిర్వహణ అధికారుల దృష్టికి వచ్చినట్లు వారు తెలిపారు. టెన్నిస్ కోర్టు 12 సమీపంలో ప్రార్థనల కోసం కేటాయించిన రూమ్ లో కొన్ని జంటలు శృంగారం కోసం వాడుకున్నట్లు తేలడంతో అధికారులు షాక్ అయ్యారు.
Read Also: Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై ఘోర ప్రమాదం.. హోటల్‌లోకి కంటైనర్.. 12 మంది మృతి
క్రీడాకారులు ప్రార్థనలు చేసేందుకు కేటాయించిన ఈ గదిలో శృంగారం జరపడాన్ని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రార్థనల కోసం కేటాయించిన రూమ్ ని సరైన మార్గంలో ఉపయోగించాలని వింబుల్డన్ నిర్వహణ అధికారులు హెచ్చరించారు. గత ఏడాది జరిగిన టెన్నిస్ పోటీల సందర్భంగా కొన్ని జంటలు గదిలో నుంచి నవ్వుతూ రావడాన్ని తాను చూశానని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ చెప్పుకొచ్చారు.
Read Also: Chinese Employees: టార్గెట్ కంప్లీట్ చేయలేదని ఎంప్లాయిస్ తో.. కాకరకాయ తినిపించిన కంపెనీ
టోర్నమెంట్ రద్దీ సందర్భంగా ఆటగాళ్లు ప్రార్థనలు చేసుకునేందుకు, చంటిబిడ్డలకు తల్లులు పాలు ఇచ్చేందుకు వీలుగా తాము ఏకాంతంగా ఉండేలా కొన్ని గదులు ఏర్పాటు చేశామని.. కాని ఆ గదుల్లో నుంచి జంటలు శృంగారం చేస్తున్న సౌండ్స్ రావడంతో కొందరు సందర్శకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ గదుల్లో జంటలు శృంగారం చేయొద్దని టోర్నమెంట్ నిర్వహణ అధికారులు క్రీడాకారులు, సందర్శకులను హెచ్చరించారు. దీంతో పాటు వింబుల్డన్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన అందమైన పార్కుల్లో శృంగారం చేయడం, డ్రగ్స్ తీసుకోవద్దని పోలీసులు సైతం వార్నింగ్ ఇచ్చారు.