Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతన కల్లు గ్రామంలో గంగాదేవి పాడు ప్రాథమిక సహకార సంఘం నూతన భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. రైతులను ఆదుకునే ప్రభుత్వమని, రైతు సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు మంత్రి తుమ్మల. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులను అన్ని రంగాలలో నడిపించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇచ్చి అభివృద్ధి చేయమన్నారని, రైతుల కోసం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించేందుకు కృషి చేశా అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకు ఎలాంటి ఇబ్బందు లేకుండా సాగునీరు అందించేందుకు కృషి చేశానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
Tirupati Stampede: బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ఎంతంటే?
అంతేకాకుండా..’ ఎన్ఎస్పి ద్వారా సాగర్ జలాలు అందకపోతే గోదావరి జలాలతోనైనా పంటలు పండించేందుకు కృషి చేస్తా. రైతుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసి సహకార సంఘాలను బలోపేతం చేస్తా. వారికి సబ్సిడీపై యంత్రాలను అందించేందుకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. గోదావరి జలాలతో వైరా, మధిర సత్తుపల్లి ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసపాలన కొనసాగింది. అప్పుల రాష్ట్రంగా మిగిలింది.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు.
Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?