Pragya Jaiswal : ‘డాకు మహారాజ్’ అద్భుతంగా ఉంటుంది : ప్రగ్యా జైస్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస ఘన విజయాలతో దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక ప్రగ్యా జైస్వాల్, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Q : అఖండ, డాకు మహారాజ్, అఖండ-2. బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేయడం ఎలా ఉంది..?
బాలకృష్ణతో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. బోయపాటి శ్రీను అఖండ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించి, నా సినీ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.
Also Read
Q : డాకు మహారాజ్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
ఇందులో నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. కావేరి పాత్రను బాబీ గారు డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్ గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.
Q : బాలకృష్ణ గారి గురించి..?
బాలకృష్ణ గారికి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తనలో తాను స్ఫూర్తి నింపుకోవడమే కాకుండా, ఇతరులలోనూ ఆ స్ఫూర్తి నింపుతూ ఉంటారు. సెట్స్ లో బాలకృష్ణ గారు అందరితో ఎంతో సరదాగా ఉంటారు. సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చారంటే, నటుడిగా దర్శకుడికి ఏం కావాలంటే అది నూటికి నూరు శాతం ఇస్తారు.
Q : జనవరి 12 మీ పుట్టినరోజు కదా, అదే రోజు డాకు మహారాజ్ విడుదలవుతుండటం ఎలా ఉంది..?
పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ బాలకృష్ణ సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. అలాగే నేను నటించిన సినిమా సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు విడుదలవుతుండటం కూడా ఎంతో సంతోషంగా ఉంది.
Q : మీ డ్రీం రోల్ ఏంటి? ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది..?
ఎస్.ఎస్. రాజమౌళి గారు, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు తీసే భారీ సినిమాలలో శక్తివంతమైన పాత్రలు పోషించాలని ఉంది. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ఉంది.
Q : దర్శకుడు బాబీ గురించి?
బాబీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత కాలానికి వచ్చింది. బాబీ అద్భుతమైన దర్శకుడు. మంచి మనిషి. సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా, వారి పనిని తేలిక చేసి, మంచి నటనను రాబట్టుకుంటారు. బాబీ కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలకృష్ణని సినిమాలో చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?