Forest Fire: దక్షిణ అమెరికాలోని సెంట్రల్ చిలీలోని అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 10 మంది మరణించారు. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున చిలీలోని అడవిలో ఈ ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో దాదాపు 1,000కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం తరువాత మంటలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. దీని కారణంగా సెంట్రల్ చిలీలోని అడవికి సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఇళ్ల నుంచి పారిపోతున్నారు.
Read Also: Kumari Aunty: కుమారి ఆంటీపై DJ సాంగ్ వైరల్..! అదిరిపోయింది!
అయితే, అంతకు ముందు చిలీలో వేడి గాలుల వల్ల అనేక చోట్ల అడవిలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో దాదాపు 13 మంది మరణించారు. ఇక, అధికారులు 14,000 హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 310 మైళ్ల (500 కిమీ) దూరంలో ఉన్న బయోబియోలోని శాంటా జువానా పట్టణంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 11 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. అటవీలో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు హెలికాప్టర్లతో అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 39 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోగా వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయని చిలీ హోంమంత్రి కరోలినా తోహా తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారనుంది అని తోహా అన్నారు.
BREAKING: Wildfires kill at least 10 people in central Chile, more than 1,000 homes destroyed pic.twitter.com/8XcnSjj3hH
— BNO News (@BNONews) February 3, 2024