ఈమధ్యకాలంలో తమకు ఆమె/అతడు నచ్చారంటూ సహజీవనం చేస్తూ భార్య/భర్తకు అన్యాయం చేస్తున్నారు. అడ్డొస్తే ఏమవుతామో అని కూడా ఆలోచించకుండా అడ్డంగా చంపేస్తున్నారు. ప్రియుడి కోసం భార్య, ప్రియురాలి కోసం భర్త కట్టుకున్నవారిని కాటికి పంపేస్తున్నారు. భార్య ఉండగానే విలాసాల కోసం మరో మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని చివరకు రోడ్డున పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు టౌన్ నెల్లూరు పోస్టల్ కాలనీలో ఏఆర్ ఎస్.ఐ. వాసు కు దేహశుద్ధి చేసింది. తనను కాదని, మరో మహిళతో కలిసి వున్న భర్తను చితకబాదేసింది.

Read Also: Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
ఓ మహిళతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశారు మొదటి భార్య సామ్రాజ్యం , ఆమె కుటుంబ సభ్యులు.. గత కొన్నేళ్లుగా మొదటి భార్య , పిల్లలకు దూరంగా ఉంటున్నాడు వాసు. వీరికి 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య భర్తలు ఇద్దరిదీ గుంటూరు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. 2017 నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. 2018లో తన భర్త మౌనిక అనే మహిళను వివాహం చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఆమెతోనే కలిసి ఉంటున్నాడని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని వాసు భార్య సామ్రాజ్యం మండిపడుతోంది. తన భర్త తనకు కావాలని భార్య డిమాండ్ చేస్తోంది.
Read Also: IPL 2023 : సన్ “రైజ్” అవుతుందా.. హ్యాట్రిక్ పై పంజాబ్ నజర్