WI vs IND Schedule, Teams and Live Streaming Details: టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నారు. విండీస్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లలో భారత్ ఆటగాళ్లు తలపడనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆపై వన్డే, టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఇక టీ20ల్లో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. భారత్ vs వెస్టిండీస్ పర్యటన షెడ్యూల్, టీమ్స్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
WI vs IND Live Streaming:
భారత్ vs వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనుండగా.. మిగతా అన్ని మ్యాచ్‌లు విండీస్‌లోనే జరగనున్నాయి. టెస్టు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఆరంభం కానుండగా.. వన్డేలు రాత్రి 7:00 గంటలకు మొదలవుతాయి. ఇక టీ20 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్నాయి. అన్ని మ్యాచ్‌లు డీడీ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్‌లలో కూడా లైవ్ చూడొచ్చు.
WI vs IND Schedule:
#టెస్టు సిరీస్
జులై 12-16 తొలి టెస్టు (డొమినికా)
జులై 20-24 రెండో టెస్టు (ట్రినిడాడ్)
# వన్డే సిరీస్
జులై 27 మొదటి వన్డే (బార్బడోస్)
జులై 29 రెండో వన్డే (బార్బడోస్)
ఆగస్టు 1 మూడో వన్డే (ట్రినిడాడ్)
# టీ20 సిరీస్
ఆగస్టు 3 తొలి టీ20 (ట్రినిడాడ్)
ఆగస్టు 6 రెండో టీ20 (గయానా)
ఆగస్టు 8 మూడో టీ20 (గయానా)
ఆగస్టు 12 నాలుగో టీ20 (ఫ్లోరిడా)
ఆగస్టు 13 ఐదో టీ20 (ఫ్లోరిడా)
Also Read: ODI World Cup 2023 Tickets Price: అభిమానులకు గుడ్‌న్యూస్.. ప్రపంచకప్ 2023 టికెట్ల ధరలు ఇవే!
WI vs IND Teams:
భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్ కుమార్.
భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్,
మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్.
భారత టీ20 జట్టు:
హార్దిక్ పాండ్య (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్.
తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు:
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.
Also Read: TNPL 2023: తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. 5 బంతుల్లో ఐదు సిక్సర్లు! మరో రింకూ సింగ్