Lok sabha election: చివరి దశ పోలింగ్‌లో ఉన్న ప్రముఖులు వీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం దేశ వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం జరగబోయే పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
శనివారం వారణాసితో పాటు యూపీలో 13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు.. పశ్చిమ బెంగాల్‌లోని 9 లోక్ సభ సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అటు జార్ఖండ్ రాష్ట్రంలోని 3 స్థానాలు.. పంజాబ్‌లోని 13 లోక్ సభ సీట్లు.. హిమాచల్ ప్రదేశ్‌లోని 4 లోక్ సభ సీట్లు.. ఒడిషాలోని 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగర్‌కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ఇది కూడా చదవండి: Arabian Restaurant: పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్లో కుళ్లిన మాంసం
ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా వారణాసి నుంచి ప్రధాని మోడీ బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మూడోసారి బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ సాధిస్తామని మోడీ ప్రకటించారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. ఇక కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ పాటలీపుత్ర, నటుడు రవి కిషన్ గోరక్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు.
ఏప్రిల్ 19న మొదటి దశతో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశలో 102 లోక్‌సభ స్థానాలకు.. రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. థర్డ్ ఫేజ్‌లో 92 లోక్‌సభ స్థానాలు.. నాలుగో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి 92 లోక్‌సభ స్థానాలు..ఐదో దశలో 49 లోక్ సభ సీట్లు.. ఆరో దశలో 58 లోక్‌సభ సీట్లుకు ఎన్నికలు జరిగాయి. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ సీట్లకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు నెలలకు పైగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Purandeswari: కేంద్ర ప్రభుత్వం ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ. 60 వేల కోట్లు ఇచ్చింది..
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!