Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fahadh Faasil: మలయాళ సినీ పరిశ్రమ నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫహద్ ఫాసిల్. అయితే హాలీవుడ్లో నటించే అరుదైన అవకాశం వచ్చినా, చివరికి ఆ ప్రాజెక్ట్‌ను ఆయన స్వయంగా వదులుకున్న విషయం తెలిసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ హాలీవుడ్ చిత్రం ‘డిగ్గర్’ లో కీలక పాత్ర కోసం ఫహద్ ఫాసిల్‌ను సంప్రదించగా, కొన్ని షరతులు అంగీకరించలేక ఆయన ఆ అవకాశాన్ని తిరస్కరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఫహద్ స్వయంగా వెల్లడించారు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ ఈసారి పూర్తిగా భిన్నమైన అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు డార్క్ కామెడీ జానర్లో రూపొందుతున్న ‘డిగ్గర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి చూపులోనే టామ్ క్రూజ్‌ను గుర్తుపట్టలేనంతగా మేకోవర్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రంలో టామ్ క్రూజ్ పాత్రకు దగ్గరి బంధువుగా ప్రముఖ బ్రిటిష్ నటుడు రిజ్ అహ్మద్ నటిస్తున్నారు. అయితే ఈ పాత్ర మొదట రిజ్ అహ్మద్‌కు కాకుండా ఫహద్ ఫాసిల్‌కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రిజ్ అహ్మద్‌తో పాటు స్టాండ్‌అప్ కమెడియన్, నటుడు వీర్ దాస్ కూడా ఈ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చారు. చివరికి రిజ్ అహ్మద్‌ను దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్ ఎంపిక చేశారు. రీసెంట్ గా మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఫహద్ ఫాసిల్, దర్శకుడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు. అయితే తన ఇంగ్లీష్ యాస దర్శకుడి అంచనాలకు సరిపోలలేదని తెలిపారు. పాత్ర కోసం పూర్తిగా సిద్ధం కావాలంటే మూడు నుంచి నాలుగు నెలలు అమెరికాలో ఉండి యాసపై ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని, ఆ సమయంలో ఎలాంటి పారితోషికం కూడా ఉండదని చిత్ర బృందం చెప్పిందని వెల్లడించారు. ఆ ప్రతిపాదన తనకు వ్యాపారపరంగా సరైనదిగా అనిపించలేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
ఫహద్ మాట్లాడుతూ, తన వద్ద డబ్బు బాగా ఉంటే వెంటనే అంగీకరించేవాడినని, కానీ కేవలం ఒక యాస నేర్చుకోవడం కోసం అంత సమయం కేటాయించే ఆసక్తి తనకు లేదన్నారు. ఇలాంటి ఆడిషన్లలో అవకాశాలు కోల్పోవడం సహజమేనని, దర్శకుడు తాను కోరుకున్న వ్యక్తి కాదని భావించి ఉండొచ్చని చెప్పారు. అయితే తన జీవితంలో వచ్చిన గుర్తింపు అంతా మలయాళ సినిమా వల్లేనని, భవిష్యత్తులో కూడా తన కెరీర్లో పెద్ద మలుపు తిరిగితే అది మలయాళ చిత్రాల ద్వారానే రావాలని కోరుకుంటున్నట్లు ఆయన ఎమోషనల్ గా చెప్పారు. కేరళను విడిచి వెళ్లి గుర్తింపు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని కూడా స్పష్టం చేశారు. అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిగ్గర్’లో టామ్ క్రూజ్ ఒక రిచ్ సీఈఓ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌తో పాటు అన్ని ప్రధాన థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. టామ్ క్రూజ్ కొత్త అవతారం ఎంత ఆసక్తిని రేకెత్తిస్తుందో, అదే స్థాయిలో ఫహద్ ఫాసిల్ తిరస్కరించిన ఈ పాత్ర కూడా ఇప్పుడు సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- cinema
- Fahadh Faasil
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!