Whatsapp View Once: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అందులో “వ్యూ వన్స్” (View Once) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్‌లను పంపితే అవి అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇది వ్యక్తిగత ఫైల్స్, ప్రైవేట్ సమాచారం పంపించడానికి అనేకమంది ఉపయోగిస్తారు. అయితే, ఈ ఫీచర్‌లో ఓ పెద్ద లొసుగు ఉండడంతో యూజర్ల ప్రైవసీకి ప్రమాదం కలుగుతోంది.
Also Read: Pawan kalyan Letter: జనసేనాని బహిరంగ లేఖ.. పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
వాట్సాప్ ప్రకారం, “వ్యూ వన్స్” ఫీచర్‌లో పంపిన మీడియాను అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత అది తిరిగి కనిపించదు. కానీ, ప్రస్తుతం ఐఫోన్‌లలో ఓ లొసుగును ఉపయోగించి, “వ్యూ వన్స్” మీడియాను మళ్లీ చూడగలిగే అవకాశం ఉంది. ఈ లొసుగుతో ఈ ఫీచర్ ఉద్దేశం పూర్తిగా విఫలమవుతోంది. ఐఫోన్ యూజర్లు ఈ క్రింది పద్ధతిని అనుసరించి “వ్యూ వన్స్” మీడియాను మళ్లీ చూడవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసి Settings > Storage and Data > Manage Storage వెళ్లాలి. అక్కడ చూపబడే కాంటాక్ట్‌ల జాబితాలో మీకు అవసరమైన వ్యక్తి పేరు ఎంచుకోండి. Sort By > Newest First ఆప్షన్ ఎంచుకుంటే “View Once” మీడియా పునరుద్ధరించబడుతుంది. దాంతో, మళ్లీ ఆ ఫోటో లేదా వీడియోను చూడగలుగుతారు. ఈ లొసుగుతో “వ్యూ వన్స్” మీడియా నిజంగా ఒకసారి మాత్రమే కనిపిస్తుందన్న నమ్మకం దెబ్బతింటోంది. వ్యక్తిగతంగా, రహస్యంగా భావించిన సమాచారాన్ని పంపేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read: Hari Priya : తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ షేర్ చేసిన హీరో
ఈ ఫీచర్‌లో ఉన్న లోపం కారణంగా వ్యక్తిగత లేదా కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని పంపే యూజర్ల ప్రైవసీ ప్రమాదంలో పడుతుంది. ప్రైవేట్ ఫొటోలు లేదా వీడియోలు ఒకసారి చూసి మాయం అవుతాయని అనుకున్నా, అవతలి వ్యక్తి వాటిని మళ్లీ చూడగలగడం షాకింగ్ అని చెప్పాలి. వాట్సాప్‌ను నిర్వహిస్తున్న మెటా కంపెనీ ఈ సమస్యను సరిదిద్దేందుకు పనిచేస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు ఈ సమస్యకు అప్డేట్ రాకముందు యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం లేదా రహస్యమైన కంటెంట్‌ను “వ్యూ వన్స్” ఫీచర్ ద్వారా పంపే ముందు దీనిపై ఆలోచించడం మంచిది.