సినీతారలు ఒక్కొకరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ పండండి బిడ్డకు జన్మనిస్తూ సెటిల్ అవుతున్నారు. అలానే టాలివుడ్ కు చెందిన హీరోయిన్ యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేసి తాను ప్రేమించిన వాడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది తిరిగే లోపే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకి ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్న ఆగండి. పిల్ల జమీందార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది హరి ప్రియా.
Also Read : Daaku Maharaaj : స్పీకర్లు జాగ్రత్త.. డాకు మహారాజ్ OST వస్తుంది
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన హిట్ సినిమా జై సింహ లోను కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి 2023 జనవరి 26న తాను ప్రేమించిన వాడు ప్రముఖ నటుడు వశిష్ట సింహను పెళ్లి చేసుకుంది హరి ప్రియ. పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత గత ఆదివారం ఈ జంటకు మగ బిడ్డ జన్మించాడు. ఆ విషయాన్నీ సోషల్ మీడియూలో ఆడియెన్స్ తో పంచుకుంటూ ఫోటోలు షేర్ చేసాడు హరి ప్రియా భర్త నటుడు వశిష్ట సింహ. ‘బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. మా జీవితంలో ఓక కొత్త అధ్యాయం మొదలైంది’ అని ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు వశిష్ఠ. పెళ్లి రోజునే బిడ్డకు జన్మనివ్వడంతో ఈ హరి ప్రియా వశిష్ఠ జంటకు అనందంలో మునిగి తేలుతున్నారు.