వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్ ఏదైనా ఈవెంట్‌ని నేరుగా అప్లికేషన్‌లో ప్లాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగించి ఈవెంట్ ఆహ్వానాలను పంపవచ్చు. వాట్సాప్ గ్రూప్ లు, కమ్యూనిటీల కోసం ఈవెంట్‌ల ఫీచర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఫీచర్ లో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు లేదా వారాంతపు పార్టీలకు సంబంధించి వాటి వివరాలను గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ ప్రణాళికలు వేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.
Also Read: Snake In Car: వామ్మో.. రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు.. కాకపోతే కారు కింద చూస్తే.. షాకింగ్ వీడియో..
ఇకపోతే మీరు మీ ట్రిప్ లను చేసుకోవాలన్న లేక రద్దు చేయాలనుకుంటే ఈ కొత్త ఈవెంట్‌ల ఫీచర్ కారణంగా మీరు చింతించాల్సిన అవసరం లేదు. అచ్చం జిమెయిల్ మాదిరిగా, నిర్దిష్ట రోజున ఎక్కడికి వెళ్లాలి..? ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారు అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వగలరు. అవును అని చెప్పే స్నేహితులు రెగ్యులర్ రిమైండర్ లను స్వీకరిస్తారు. కాబట్టి మీరు మీ ప్రయాణ తేదీని మరచిపోకుండా ఉంటారు. మీ ప్రయాణంలో మీతో పాటు ఎవరు వస్తారు..? దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇదే ఫీచర్ ఇప్పటికే జిమెయిల్లో అందుబాటులో ఉంది.
Also Read: Iphone Alarm: ఐఫోన్ లో మూగబోయిన ‘అలారం’.. నిర్ధారించిన ఆపిల్ సంస్థ..
ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ కమ్యూనిటీల కోసం తయారు చేయబోతున్నారు. రానున్న రోజుల్లో వాట్సాప్ గ్రూపులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ తన బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని తర్వాత, వాట్సాప్ వినియోగదారులు అందరూ పొందుతారు. గ్రూప్ మెంబర్ ఎవరైనా ఈవెంట్‌ని క్రియేట్ చేయవచ్చు. ఇతర గ్రూప్ సభ్యులు కూడా దీనికి ప్రతిస్పందించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో యాత్రకు ఎవరు వస్తారో, ఎవరు రాలేదో అందరికీ తెలుస్తుంది.