గత కొన్ని రోజులుగా, చాలా మంది అనుకున్న సమయానికి మేల్కొలపడానికి కష్టపడుతున్నారు. అదికూడా ఐఫోన్ వినియోగదారులు మాత్రమే. అలారం ఒక్కటి ప్రస్తుతం ఐఫోన్ యూజర్స్ ను ఇబ్బంది పెడుతుంది. చాలమంది అనుకోకుండా ఫోన్ ను మ్యూట్ చేసి ఉండవచ్చని భావించి, ప్రతి రాత్రి పడుకునే ముందు వాల్యూమ్ ను గరిష్టంగా ఉంచుతున్న కానీ సమస్య కొనసాగుతుంది. ఐఫోన్ తమ వినియోగదారులను మేల్కొల్పే బదులుగా ఎటువంటు శబ్దం చేయకుండా కేవలం అది లైట్ వెలగడం వరకే పనిచేస్తుంది . దీంతో ప్రతిరోజు చాలామంది నిద్ర లేయడానికి ఆలస్యం అవుతుంది. చాలామంది వినియోగదారులు వేరువేరు సమయాల్లో అలారం ఉంచుకొని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఫలితం కనబడట్లేదు. మరికొందరైతే అలారం టోన్స్ కూడా మార్చి ప్రయత్నం చేశారు ఆయన కానీ ఇటువంటి ప్రయోజనం కనిపించడం లేదు.
Also Read: Ajeya Kallam: ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోంది..
ఇలా మంచి వ్యాప్తంగా ఐఫోన్ 15 ప్రో వాడే అనేక మందిలో ఈ సమస్య లేవనెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం సంబంధించి అనేక ఫిర్యాదులను ఐఫోన్ సంస్థ ఎదుర్కొంది. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా చాలామంది రెడ్డిట్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలపై నివేదించారు. దీనికి అనుకూలంగా ముందుగా సమస్యని నిర్ధారణ చేసుకొని ఆపిల్ సంస్థ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: Baahubali: బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో వారు వారి ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి.. సెట్టింగులు> సౌండ్ & హాప్టిక్స్ లోని రింగ్టోన్, అలర్ట్స్ వాల్యూమ్ స్లైడర్ గరిష్టంగా సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. మీ ఫోన్ రింగర్ ఆన్ లేదా ఆఫ్ అయినా మీ అలారంను ప్రభావితం చేయదు. కానీ, మీ రింగర్ యొక్క వాల్యూమ్ సెట్టింగులు ప్రభావితం చేస్తాయి. మీ రింగర్ అత్యల్ప వాల్యూమ్ ను సెట్ చేసి ఉంటే, మీ అలారం తగినంత శబ్దం చెసిండకపోవచ్చు. ఆపిల్ వెబ్సైట్ ప్రకారం., “అలారాలు మీరు మీ రింగర్ కోసం సెట్ చేసిన వాల్యూమ్ కు సరిపోతాయి”. మీ అలారం వాల్యూమ్ సరిగ్గా లేకపోతే, మీరు వాల్యూమ్ బటన్ను పైకి లేదా క్రిందికి నొక్కడం ద్వారా దాన్ని సర్దుబాటు చేయవచ్చు అని తేలింది. ప్రత్యామ్నాయంగా, మీరు సెట్టింగులు> సౌండ్స్ కు వెళ్లడం ద్వారా వాల్యూమ్ ను సర్దుబాటు చేయవచ్చు.