ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఇటీవలే మెసేజింగ్ ప్లాట్‌ఫారంలో వాయిస్ నోట్స్ ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు దానికి వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్‌లు ఒక్కసారి ఏదైనా వాయిస్ నోట్స్ విన్న తర్వాత అది ఆటోమాటిక్‌గా అదృశ్యమై పోతుంది. వాయిస్ మెసేజ్‌లను పంపడానికి ముందుగానే వినియోగదారులు వ్యూ వన్స్ మోడ్ ద్వారా పంపుకోవచ్చు..
గతంలో ఇమేజ్ లకు వ్యూ వన్స్ అనే ఫీచర్ ను తీసుకొని వచ్చింది.. ఇప్పుడు వాయిస్ నోట్స్ కోసం అదే వ్యూ వన్స్ ఫీచర్‌ను చేర్చింది.. వాయిస్ నోట్స్ ఫీచర్ యూజర్ల మెసేజ్‌లకు అదనపు ప్రైవసీని అందించనుంది. మీరు ఇతరులకు పంపిన వాయిస్ నోట్ మరొకరికి ఫార్వార్డ్ చేస్తారని ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఇకపై వాయిస్ నోట్ పంపే ముందు ఈ ఫీచర్‌ని ఆన్ చేసి వాయిస్ నోట్‌ని పంపవచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుడితో పర్సనల్ వివరాలను షేర్ చేయడం లేదా మీరు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మీ మెసేజ్ మరెవరూ వినకూడదనుకుంటున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగించవచ్చు…
ఈ సరికొత్త వాయిస్ మెసేజ్‌ల కోసం వ్యూ వన్స్ ఫీచర్ రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది. మీరు వాట్సాప్ హెల్ఫ్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా ఇది ఎలా పని చేస్తుందనే మరింత తెలుసుకోవచ్చు. ఇటీవల సంవత్సరాలలో వాట్సాప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ-కేంద్రీకృత ఫీచర్ల శ్రేణిలో అదృశ్యమవుతున్న వాయిస్ మెసేజ్ ఫీచర్ కొత్తది. వ్యూ వన్స్ మోడ్ ద్వారా ఫొటోలు, వీడియోలతో పాటు, వాట్సాప్ అన్ని మెసేజ్‌లు, కాల్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది.. ఇంకా మరెన్నో ప్రైవసీ ఫీచర్స్ ను తీసుకురావాలనే యోచనలో వాట్సాప్ ఉంది..