సోషల్ మీడియా ఓ దొంగను పట్టుకోవడంలో కీలకంగా మారింది. ఆటోను చోరీ చేసిన ఓ దొంగను వాట్సాప్ గ్రూప్ పట్టించింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురవడంతో.. వాట్సప్ గ్రూప్ లో విషయాన్ని పోస్ట్ చేశాడు ఆటో ఓనర్. విషయం చక్కర్లు కొడుతూ పలు వాట్సప్ గ్రూపుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ చోరీకి గురైన ఆటోను బంజారాహిల్స్ లో గుర్తించాడు. ఆటో కి స్టిక్కర్లు తొలగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Also Read:Gujarat: కబడ్డీ మ్యాచ్లో వివాదం.. హాస్టల్లో ఇంటర్ విద్యార్థిపై పిడిగుద్దులు..
బొల్లారం రిసాలబజార్లో నివసించే ఝార్ఖండ్ కి చెందిన బిపిన్ రాజ్ యాదవ్ ఆటో చోరీకి గురైంది. ఆటో ను ఓ వ్యక్తి చోరీ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. విషయాన్ని జార్ఖండ్ ఏక్ థా సమాజ్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు ఆటో ఓనర్.. విషయాన్ని మరికొన్ని వాట్సాప్ గ్రూప్ లకు ఫార్వర్డ్ చేశాడు దీపక్ కుమార్.. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-10 స్టార్ ఆస్పత్రి వద్ద ఆటో ను గుర్తించిన మరో ఆటో డ్రైవర్ కల్లుకుమార్.. ఆటో కి ఉన్న స్టిక్కర్లు తొలగిస్తుండగా పట్టుకున్న కల్లు కుమార్… విషయాన్ని ఆటో ఓనర్ బిపిన్ కి చెప్పాడు కల్లు కుమార్.. ఆటో ను దొంగిలించిన జీడిమెట్ల కి చెందిన రోహిత్ ను అదుపులోకి తీసుకుని.. అల్వాల్ పోలీసులకు అప్పగించారు బంజారాహిల్స్ పోలీసులు.