Gujarat: గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జూలై 26వ తేదీన జరిగిన కబడ్డీ మ్యాచ్ వివాదం తరువాతి రోజున నలుగురు తోటి విద్యార్థులు కలిసి 12వ తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో దారుణంగా కొట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. కాగా, దాడికి పాల్పడిన వారందరూ హాస్టల్ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత భయపడ్డ బాధిత విద్యార్థి హాస్టల్ అధికారులకు తాను అనారోగ్యంగా ఉన్నానని చెప్పి, తన తండ్రితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు.
Read Also: Karnataka: అమ్మ దేవుడా.. బతికి పోయాన్ రా.. లవర్ సాయంతో భర్తపై హత్యాయత్నం..
ఇక, బాధితుడి తండ్రి విమల్ చోంచా మాట్లాడుతూ.. గత నెలలో నా కొడుకును హాస్టల్‌లో కొంతమంది విద్యార్థులు కొట్టారు.. ఈ విషయం నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రమే తెలిసింది.. పాఠశాల నిర్వాహకులు మాకు ఏలాంటి సమాచారం ఇవ్వలేదు.. నేను వారిని కలవడానికి వెళ్లినా, వారు నన్ను కలవలేదు.. ఫోన్ చేసినా ఎత్తలేదు అని ఆరోపించారు. అలాగే, ఈ గొడవ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
కాగా, ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారి హితేష్ ధంధాలియా మాట్లాడుతూ.. వీడియో ఆధారంగా నలుగురు విద్యార్థులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం.. అలాగే, పాఠశాల నిర్వహణకుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది అన్నారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పాఠశాలలు కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
This Junagadh hostel assault video is disturbing. 5 minors booked under the Juvenile Justice Act. A wake-up call, bullying ruins lives. Parents, schools & hostels must ensure safe spaces for every child.
https://t.co/xF8SX4kseK— Sood Saab (@SoodSaab11) September 4, 2025