★ తిరుమల: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. నేడు గజ వాహనం పై ఉరేగింపుగా రానున్న శ్రీవారు.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
★ గుంటూరు: నేటి నుండి వాటర్ పైపుల మరమ్మతులు.. రెండు రోజుల పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్న కార్పొరేషన్ అధికారులు
★ నేడు తిరుపతి రూరల్ మండలంలో గంగ జాతర, పాల్గొననున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
★ కాకినాడ: నేడు తునిలో మంత్రి దాడిశెట్టి రాజా పర్యటన.. జగనన్న విద్యా దీవెన పథకంలో అర్హత పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి
★ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
★ వరంగల్ జిల్లాలో రెండో రోజు మంత్రి హరీష్‌రావు పర్యటన
★ ఢిల్లీ: నేడు రాజద్రోహం సెక్షన్ తొలగింపుపై సుప్రీంకోర్టు విచారణ
★ ఐపీఎల్: నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనున్న గుజరాత్ టైటాన్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్