Whats Today Updates 12.10.2022
1. ద్వారకా తిరుమలలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు. నిన్న రాత్రి శయన మహావిష్ణువు అలంకారంలో భక్తులకు చినవెంకన్న దర్శనం.
2. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.59,100లుగా ఉంది.
3. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. పలు కీలక విషయాలపై చర్చించనున్న కేబినెట్.
4. ఢిల్లీలో సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్. నిన్న ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన సీఎం. వారం రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ మకాం. పలు పార్టీల నేతలతో చర్చించనున్న కేసీఆర్
5. 30వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల పాదయాత్ర. నేడు తణుకు మండలం వేల్పూరు నుంచి పైడిపర్రు, పాలంగి మీదుగా రైతుల మహాపాదయాత్ర. రాత్రి ఉండ్రాజవరంలో రైతుల బస.
6. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు. నేటితో ముగియనున్న అభిషేక్ రావు కస్టడీ. సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ.