* నేడు జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం.. రాత్రి 7గంటలకు షేక్ పేట డివిజన్ లో సీఎం రేవంత్ కార్నర్ మీటింగ్.. రాత్రి 8గంటలకు రహమత్ నగర్ లో సీఎం రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్..
* నేడు జూబ్లీహిల్స్ లో కేటీఆర్ ప్రచారం.. రాత్రి 7గంటలకు సోమాజిగూడ డివిజన్ లో భారీ రోడ్ షో..
* నేడు జూబ్లీహిల్స్ లో రాంచందర్ రావు ప్రచారం.. ఎర్రగడ్డ డివిజన్ లో కరపత్రాల పంపిణీ కార్యక్రమం.. కల్పతరువు రెసిడెన్సీ, మల్టీపర్పస్ హాల్ లో కరపత్రాల పంపిణీ కార్యక్రమానికి రాంచందర్ రావు..
* నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హోమ్ ఓటింగ్ సదుపాయం.. ఇవాళ, ఎల్లుండి ఇంటి వద్దనే ఓటు వేసేందుకు వికలాంగులు, వృద్ధులకు అవకాశం.. హోమ్ ఓటింగ్ కి దరఖాస్తు చేసుకున్న 84 మంది వృద్ధులు, 19 మంది వికలాంగులు..
* నేటి నుంచి పరీక్షలను బహిష్కరిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య.. ఈ నెల 8న హైదరాబాద్ లో కాలేజీల సిబ్బందితో సమావేశం.. ఈ నెల 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ నిర్వహిస్తామని ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య వెల్లడి..
* నేడు టీడీపీ కార్యాలయానికి మంత్రి నారా లోకేష్.. ప్రజాదర్భార్, సమన్వయ సమావేశంలో పాల్గొననున్న లోకేష్..
* నేడు మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన.. దెబ్బ తిన్న పంటలనున పరిశీలించి.. రైతులను పరామర్శించనున్న జగన్.. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జగన్ పర్యటన..
* నేడు కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణ.. ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకోనున్న కమిటీ.. ఉదయం కొలికపూడి, సాయంత్రం కేశినేని చిన్ని హాజరు..
* నేడు విచారణ చేపట్టనున్న ఆరో AJMFC కోర్టు.. ఇప్పటికే జోగి రమేశ్, జోగి రాములను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన సిట్..
* నేడు కైంచిధామ్ లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించనున్న ముర్ము.. నైనిటాల్ లోని కుమావున్ యూనివర్సిటీలో జరిగే 20వ స్నాతకోత్సవానికి హాజరుకానున్న రాష్ట్రపతి.. వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం కార్యక్రమం..
* నేడు రాష్ట్రాల నోడల్ అధికారులతో కేంద్రం సమావేశం..
* నేటితో బీహార్ లో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.. నవంబర్ 11న రెండవ విడదలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు..
* నేడు బీహార్ లో ముగ్గురు బీజేపీ సీనియర్ నేతల ప్రచారం.. బీహార్ లోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలో పాల్గొననున్న జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్..
* నేడు బీహార్ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం.. మూడు బహిరంగ సభలలో పాల్గొననున్న రాహుల్ గాంధీ..
* నేడు ఆన్ లైన్ బెట్టింగ్ పై సుప్రీంకోర్టులో విచారణ.. ఈస్పోర్ట్స్, సోషల్ గేమ్స్ పేరుతో బెట్టింగులు నడుస్తున్నాయని సుప్రీంలో పిల్.. నిన్న కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
* నేడు శబరిమలలో యాత్రికుల కోసం రూ. 6.12కోట్లతో ఆస్పత్రి.. నీలక్కల్ లో శంకుస్థాపన చేయనున్న కేరళ ప్రభుత్వం..