నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీఈసీ మీటింగ్ కు హాజరు.. తెలంగాణలో మిగిలిన అభ్యర్థులపై చర్చ..
నేడు ఖమ్మం, కోదాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి
నేడు చిలకలూరుపేటలో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి సభ ఏర్పాట్లకు భూమిపూజ.. పాల్గొననున్న మూడు పార్టీల నేతలు..
నేడు బీజేపీ రెండో జాబితా విడుదల అయ్యే అవకాశం.. తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం..
నేడు నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగే పీఎం సూరజ్ పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారు..
నేడు నేడు జంగారెడ్డి గూడెం లో పర్యటించనున్న ఎంపీ మిథున్ రెడ్డి..
నేడు హిందూపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర.. పట్టణంలో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ప్రారంభించనున్న వసుంధర..
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పర్యటన.. ఉదయం: 11:00 గంటల పిడింగోయ్యి గ్రామంలో 1 కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కవలగోయ్యి ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద కార్యక్రమంలో పాల్గొంటారు.
నేడు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణీ గోవర్ధన్ రెడ్డి మణుగూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
నేడు నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నేతలతో సమావేశం నిర్వహించనున్న జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి..
నేడు నెల్లూరు రూరల్ మండలంలోని ఆమాంచర్లలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి..
నేడు ఆత్మకూరులో వైయస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి..
నేడు గుంటూరు మిర్చి యార్డ్ కు విరామం.. ఇతర రాష్ట్రాల నుండి అధికంగా వస్తున్న మిర్చి పంట దిగుమతులను ఒక రోజు పాటు నిలిపివేస్తున్న అధికారులు..
నేటి నుంచి తిరుపతి విమానశ్రయంలో శ్రీవాణి టిక్కెట్ల కౌంటర్ పున:ప్రారంభం.. రోజుకి 100 శ్రీవాణి టిక్కెట్లు ఆఫ్ లైన్ విధానంలో కేటాయింపు.. బోర్డింగ్ పాసులు కలిగిన భక్తులుకు మాత్రమే విమానశ్రయంలో టిక్కెట్లు కేటాయింపు..
వైభవంగా కొనసాగుతున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఉదయం మత్స్యావతార అలంకార సేవ.. రాత్రికి శేషవాహనంపై ఊరేగనున్న నరసింహస్వామి..