తెలంగాణలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల. మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేయనున్న సీఎం రేవంత్. టెన్త్ పరీక్షలు రాసిన 5 లక్షల మంది స్టూడెంట్స్. ఈ సారి గ్రేడింగ్‌తో పాటు మార్కులు విడుదల. టెన్త్ మెమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్.
నేడు మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీట్. మధ్యాహ్నం 1.30కి సచివాలయంలో మంత్రులతో సీఎం లంచ్. అమరావతి రాజధాని రీలాంచ్ కార్యక్రమం, ప్రధాని మోడీ సభ విజయవంతం చేయడంపై చర్చ.
విడదల గోపి కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ. కస్టడీపై నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న న్యాయస్థానం. ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోపి. బెయిల్ పిటిషన్‌పై నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న కోర్టు.
IPS అధికారి PSR బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా. నేడు విచారించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు. నటి జత్వానీ కేసులో అరెస్టైన పీఎసార్ ఆంజనేయులు.
నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశాలు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలి కేబినెట్ భేటీ. పాక్‌పై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం. పాక్ విమానాలకు భారత్ ఎయిర్‌స్పేస్ మూసివేత. మందుల ఎగుమతులు, కాల్పుల విరమణ ఒప్పందంపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్.
శ్రీ సత్యసాయి : కియా ఇంజిన్ల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం. కస్టడీలో ఉన్న నిందితులతో కలిసి రెండు బృందాలుగా ఢిల్లీ, చ్తెన్నెలో తనిఖీలు చేసిన సిట్ పోలీసులు. చోరీకి గుర్తెన ఇంజిన్లను కంట్తెనర్లను చ్తెన్నెకు తరలించినట్లు గుర్తించిన పోలీసులు. కంట్తెనర్లను సీజ్ చేసీ పెనుకొండకు తరలింపు. ఇవాళ్టితో ముగియనున్న ఆరుగురు నిందితుల పోలీసుల కస్టడీ.
నేడు పాలిసెట్ పరీక్ష.. పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. జిల్లాలో 8083 మంది అభ్యర్ధులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారు.. విజయనగరం లో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు , గజపతినగరం లో 8 కేంద్రాలు ఏర్పాటు.. పరీక్ష కేంద్రాల కు అవసరమగు బస్సు లను ఏర్పాటు.. రెవెన్యూ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్.
నేడు ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుని వివాహానికి హాజరవనున్న రేవంత్. ఉదయం 9:15కు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరనున్న సీఎం రేవంత్. ఉదయం 10:40కు గంగూర్ ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి రాక. ఉదయం 10:50 నుంచి 11:30 వరకు వివాహ వేడుకలో పాల్గొననున్న సీఎం రేవంత్. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న రేవంత్.
అల్లూరి సీతారామ రాజు జిల్లా : నేఢు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రంపచోడవరం ఐటీడీఏ ముందు ధర్నా. మే 2వ తేదీన జరిగే మన్యం బంద్ కు ఆదివాసి నిరుద్యోగులు పిలుపు. మెగాడీఎస్సీలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి పోస్టు కూడా జనరల్ డిఎస్సీ నుంచి మినహాయించాలని డిమాండ్.