విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణ. నేడు జేసీ ముందు హాజరుకానున్న నలుగరు డిప్యూటీ కలెక్టర్లు సహా ఏడుగురు అధికారులు.
సంగారెడ్డిలో నేడు కాంగ్రెస్ నాయకుల భేటీ. జగ్గారెడ్డి అధ్యక్షతన ప్రారంభంకానున్న సమావేశం. MLC అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం.
నేడు నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన. ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న నాదెండ్ల, ఆనం, నారాయణ.
నేడు వనపర్తి జిల్లాలో మంత్రులు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు.
యాదగిరిగుట్టలో మహాకుంభ సంప్రోక్షణ. నేడు పంచకుండాత్మక యాగం.
రేపు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్. రేపు స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ. పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్‌తో కలిసి మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొననున్న రేవంత్.
ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న భక్తులు రద్దీ. మరో నాలుగు రోజుల్లో ముగియనున్న కుంభమేళా. చివరివారం కావడంతో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,870 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,290 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్. లాహోర్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్.
నేడు ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశం. పాల్గొనున్న మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతలు. ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేయడంపై చర్చ.
చండీగఢ్: నేడు రైతు నాయకులతో కేంద్రం చర్చలు. పంటలు కనీస మద్దతు ధర చెల్లింపుపై చర్చ.
అమరావతి: నేడు మిర్చి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.
ఢిల్లీ: ఆస్పత్రి నుంచి డిశ్చార్చయిన సోనియాగాంధీ. సర్ గంగారం ఆస్పత్రి నుంచి రాత్రి డిశార్చ్.