Pm Modi: ఎన్నికల ప్రచారంలో మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక చేసిన వెంటనే సదరు వ్యక్తి కాల్‌ను కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్‌కు సమాచారాన్ని అందించారు. వారు విచారణ చేపట్టి కాల్ వివరాలను విశ్లేషించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు.
READ MORE: High Court: లోకేష్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయడం సరికాదు: పిన్నెల్లి తరఫు న్యాయవాది
Also Read
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
- T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని మధ్యప్రదేశ్ పోలీసులకు సూచించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని కాలర్ మధ్యప్రదేశ్‌లోని ఏ లొకేషన్ నుంచి కాల్ చేశాడు ? అతడు ఏ సిమ్ కార్డును వాడాడు ? అనేది గుర్తించడంపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కాగా.. వాంటెడ్ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్స్‌ను ప్రకటించింది. వాటిలోనే ఓ నంబరుకు ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం గమనార్హం. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతానంటూ ఓ ఆగంతకుడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఒక మీడియా సంస్థకు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానిపై అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా వచ్చిన ఈ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన బహిరంగ సభతో పాటు తప్పకుండా రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్ భద్రతా సిబ్బందిలో గుబులు పుట్టిస్తోంది.
తాజావార్తలు
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
-
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!