చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్‌లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు.