Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 Men Rob Car At Gunpoint In Delhi Tunnel: ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ కారుని అడ్డగించి, గన్‌తో బెదిరించి, డబ్బులు దోచుకుపోయారు. ఢిల్లీలోని 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రగతి మైదాన్ టన్నెల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు ఒక క్యాబ్ బుక్ చేసుకొని, గురుగ్రామ్‌కి బయలుదేరారు. రూ.2 లక్షల డబ్బులతో నిండిన ఒక బ్యాగ్‌ని డెలివరీ చేయడానికి వాళ్లు క్యాబ్‌లో వెళ్తున్నారు. ఆ క్యాబ్ ప్రగతి మైదాన్ టన్నెల్‌లోకి ప్రవేశించగానే.. రెండు బైక్‌ల మీద నలుగురు దుండగులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఒక చోట ఆ కారుని అడ్డగించి, ఇద్దరు బైక్‌ల నుంచి దిగారు. ఒకరు గన్‌తో బెదిరిస్తుండగా, మరొకరు డబ్బులతో నిండిన బ్యాగ్‌ని తీసుకున్నాడు. బ్యాగ్ చేతికి అందగానే.. అక్కడి నుంచి ఆ నలుగురు ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ టన్నెల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. దొంగల్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుండుగులు క్యాబ్‌లోని ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటి నుంచి వెంబడిస్తున్నారు? ఇందులో అంతర్గత వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. టన్నెల్‌ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచామని.. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నారని తెలిపారు. దోషులను పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
Vikarabad Crime: కోరిక తీర్చమని వివాహితని అడిగాడు.. దాబాకు తీసుకెళ్లి, మందు తాగిపించి..
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్ సక్సేనా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పుకొని.. ఢిల్లీ ప్రజల్ని సురక్షితంగా ఉంచే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు బాధ్యతల్ని అప్పగించాలన్నారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమైందన్న ఆయన.. మీకు చేతకాకపోతే తమకు బాధ్యతలు ఇవ్వాలన్నారు. నగర ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో తాము చూపిస్తామని ఛాలెంజ్ చేశారు.
LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi.
If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!