Warangal: వరంగల్ జిల్లాలోని వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ వివాహిత కత్తితో హల్చల్ చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..!
ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. జ్యోత్స్న అనే వివాహిత తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ నేపథ్యంలో భర్తపై కత్తితో దాడి చేసేందుకు ఆమె ప్రయత్నించింది. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన శ్రీకాంత్ వెంటనే అక్కడి జ్యువలరీ షాపులోకి వెళ్లి దాక్కొని, డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
Drugs Party: గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 12 మంది అరెస్ట్..!
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జ్యోత్స్న చేతిలో ఉన్న కత్తిని లాక్కొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జ్యోత్స్న రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగింది. తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకుని, తనకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని ఆమె బహిరంగంగా అరుస్తూ హల్చల్ చేసింది. ఇక శ్రీకాంత్ ఇప్పటికే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జ్యోత్స్నకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చట్టపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని వారు సూచించారు.