ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులో పర్యటించనున్న విషయం తెలిసిందే. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్నారు. మధురై విమానాశ్రయంలో పవన్‌కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్య అతిథిగా పవన్…
తమిళనాడులో కార్తికేయుడి భక్తులతో నేడు బీజేపీ నిర్వహిస్తూన్న మురుగన్ మహా భక్త సమ్మేళనం రాష్ట్రంలో పోలిటికల్ హీట్ పెంచింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దానికి కారణం అయ్యింది. అమ్మ తిడల్, పాండికొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి దాదాపు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. ఎన్నికలకు ఎడాది ముందుగానే సై…
హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో నేడు ‘మురుగన్ మహా భక్త సమ్మేళనం’ జరగనుంది. మధురైలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్త సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు హిందూ మున్నణి సంస్థ అధ్యక్షుడు కాడేశ్వర సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అమ్మ తిడల్, పాండి కొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భక్త సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే…