ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ కోసం ఇంటింటికి వెళ్లి ఓటరు సర్వే శుక్రవారం విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రారంభం కానుంది. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి అధికారులకు సహకరించాలని, ప్రస్తుత ఓటర్లను సరిచూసేందుకు, చనిపోయిన ఓటర్లను, 100 ఏళ్లు పైబడిన ఓటర్లను, ఎన్టీఐ ఓటర్లను, ఇతరులను గుర్తించేందుకు చేపట్టే సర్వేలో పాల్గొనాలని కోరారు. జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర , జిల్లా స్థాయి అధికారులు సమగ్ర ఓటర్ సర్వే ను చేపడతారు. సెప్టెంబరు 30లోగా సర్వే ముగించి, అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను నవంబర్ 30 వరకు స్వీకరిస్తారు.
ఓటర్ సర్వే లో పరిశీలించే అంశాలు ఇవే
కొత్త గా 18 యేళ్లు నిండిన వారు లేదా జనవరి 1 2024 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు కొత్త ఓటు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఇంటికి భూత్ స్థాయి అధికారులు వచ్చినప్పుడు వారి వద్ద ఫార్మ్ 6 తీసుకొని నింపి ఆధార్ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటింటికి నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు ఈ సర్వే కోసం పర్యటిస్తారు.