బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సౌండ్ పార్టీ.. ఈ మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 24న) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీజే సన్నీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.ఎలెక్షన్స్ టైమ్‌లో వస్తోన్న మా సౌండ్ పార్టీ సినిమాకు అన్ని పార్టీల మద్దతు ఉందని వీజే సన్నీ తెలిపాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సౌండ్ పార్టీ మూవీ ఆడియెన్స్‌ను అస్సలు డిస్సపాయింట్ చేయదని అన్నాడు. కామెడీ తన ఫేవరేట్ జానర్ అని సన్నీ తెలిపాడు. గతంలో కామెడీ కథాంశాలతో చేసిన సినిమాలు అంతగా వర్కవుట్ కాలేదని, ఎక్కడ పోగోట్టుకున్నది అక్కడే రాబట్టుకోవాలనే ఫార్ములాను నమ్మి సౌండ్ పార్టీ మూవీ చేసినట్లు సన్నీ తెలిపాడు.”బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన మంచి సినిమాల్లో సౌండ్ పార్టీ మూవీ ఒకటి. తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్‌ను ఈ సినిమాలో ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు సంజయ్ శేరి చూపించాడు.
బిట్ కాయిన్ అనే పాయింట్ ఆధారంగా సౌండ్ పార్టీ మూవీ కథ సాగుతుంది. దానిలో భాగంగానే లవ్ స్టోరీ మరియు రొమాన్స్ అంశాలు కూడా ఉంటాయి. దర్శకుడు సంజయ్ తాను అనుకున్న కథను పర్‌ఫెక్ట్ గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు” అని వీజే సన్నీ అని తెలిపాడు.సౌండ్ పార్టీ మూవీలో నాకు, శివన్నారాయణ గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అలాగే పంచ్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తాయని వీజే సన్నీ అన్నాడు. హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ ఆమని మేనకోడలు అనే విషయం షూటింగ్ సమయంలోనే తనకు తెలిసిందని సన్నీ తెలిపాడు… సౌండ్ పార్టీ మూవీకి వెన్నెలకిషోర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని సన్నీ పేర్కొన్నాడు. అలాగే సౌండ్ పార్టీ మూవీకి మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర మరియు రవిపొలిశెట్టి ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు