Vivo T4 Ultra 5G: వివో కంపెనీ నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Vivo T4 Ultra 5G భారత్‌లో జూన్ 11న విడుదల కాబోతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే మైక్రోపేజీ లైవ్ అయింది. ఇందులో ఫోన్‌కు సంబంధించిన రంగులు, డిజైన్, ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో తొలి సారిగా 50MP పెరిస్కోప్ లెన్స్ ఉండబోతోంది. అదే విధంగా pOLED 120Hz క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వివో తన T4 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 11, మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఈ-స్టోర్, అలాగే రిటైల్ ఛానెల్ భాగస్వాముల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Read Also: Poco F7: అధునాతన ఫీచర్లతో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7..!
వివో T4 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు (అంచనా):
డిస్‌ప్లే: 6.67-అంగుళాల pOLED క్వాడ్ కర్వ్డ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్.
తీవ్రమైన ప్రకాశం: 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐ కేర్ సర్టిఫికేషన్.
ప్రాసెసర్: MediaTek Dimensity 9300+.
RAM మరియు స్టోరేజ్: LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్.
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత FunTouchOS 15.
బ్యాటరీ: 5,500mAh సామర్థ్యంతో 90W ఫాస్ట్ ఛార్జింగ్.
Read Also: Virat Kohli: “ఇలాంటి ఫ్యాన్స్ ఏ జట్టుకూ ఉండరు”.. విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
వాటర్/డస్ట్ రెసిస్టెన్స్: IP69 సర్టిఫికేషన్.
కెమెరా విభాగం..
ప్రధాన కెమెరా: 50MP Sony IMX921 సెన్సార్,
టెలిఫోటో: 50MP 3x పెరిస్కోప్ లెన్స్,
మాక్రో: 10x టెలిఫోటో మాక్రో లెన్స్,
అల్ట్రా వైడ్ లెన్స్: 8MP,
ఫ్రంట్ కెమెరా: 50MP సెల్ఫీ కెమెరా.
ధర:
వివో కంపెనీ అధికారిక ధరను ఇంకా వెల్లడించలేదు. కానీ అంచనాల ప్రకారం ఈ ఫోన్ రూ. 30,000 – రూ. 35,000 మధ్య ఉండే అవకాశం ఉంది. గతంలో విడుదలైన Vivo T3 Ultra 5G ధర రూ. 31,999గా ఉంది. ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో, స్టైలిష్ డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశముంది.