Poco F7: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7ని భారతదేశం, ఇతర దేశాలలో త్వరలో విడుదల చేయనుందని సమాచారం. ఇప్పటికే లీకుల ద్వారా పలు విషయాలు బయటపడ్డాయి. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ డివైస్ జూన్ 17 లేదా 19వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. పోకో F7 ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అనుభవంతో శక్తివంతమైన పనితీరును అందించనుందని అంటున్నారు. పోకో ఇంకా అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ, లీకుల ప్రకారం బేస్ వేరియంట్ ధర సుమారుగా రూ. 34,999గా ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 39,999 వరకు ఉండవచ్చు. గతంలో విడుదలైన పోకో F6 బేస్ ట్రిమ్ రూ. 29,999 వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Read Also: Southwest Monsoon: నైరుతి రుతుపవనాలకు “షార్ట్ బ్రేక్”.. మండుతోన్న ఎండలు..
పోకో F7 స్పెసిఫికేషన్లు (లీకుల ప్రకారం):
పోకో F7 డివైస్ చైనాలో విడుదలైన Redmi Turbo 4 Pro కు రీబ్రాండెడ్ వర్షన్ అయి ఉండొచ్చని అంచనా.
డిస్‌ప్లే: 6.83-ఇంచ్ ఫ్లాట్ OLED LTPS డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8s Gen 4
Read Also: Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!
RAM & స్టోరేజ్: 16GB RAM వరకు, 512GB వరకు స్టోరేజ్.
బ్యాటరీ: 7,550 mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
సాఫ్ట్‌వేర్: Android 15 ఆధారిత HyperOS 2.0
వాటర్ రెసిస్టెన్స్: IP68/IP69 రేటింగ్.
ఇతర ఫీచర్లు: IR బ్లాస్టర్.
కెమెరా సెటప్:
పోకో F7 ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP సెకండరీ లెన్స్ ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు.