అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ దుర్గమ్మ సన్నిధికి వెళితే అంతా శుభం జరుగుతుంది. విజయవాడలో వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అమ్మవారి దర్శనంతో పునీతులు అవుతుంటారు. అయితే ఇంద్రకీలాద్రి లో దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోందని భక్తులు వాపోతున్నారు. దుర్గమ్మ కొండపై దళారుల బెడద ఎక్కువగా ఉంది. కేశఖండనశాలలో భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు సిబ్బంది. దూర ప్రాంతాల నుంచి వచ్చు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు దేవస్థానం సిబ్బంది.
Read Also: Yuva Avastha 2023: ఈ నాలుగు రాశులకు రాజయోగమే.. ఎందుకంటే?
కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించే భక్తుల నుండి అధిక దోపిడీ చేస్తున్నారు. దుర్గగుడి కేశఖండన శాలలో భక్తుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సెంటిమెంటును ఆసరా చేసుకుంటున్నారు దేవాలయ సిబ్బంది.. భక్తులు సమర్పించే తలనీలాలు టికెట్ ధర 25 రూపాయలు..ఆలయ సిబ్బంది మాత్రం 500 రూపాయలు డబ్బులు ఇస్తేనే తలనీలాలు చేస్తాం లేకపోతే లేదు అని చెబుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలకు తొలిసారి తలనీలాలు సమర్పించాలని సర్వం ఇవ్వాల్సిందే. దుర్గగుడి కేశఖండన శాలలో రోజు ఇదే తంతు. భక్తులను దోపిడీ చేస్తున్న దేవస్థానం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్