CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. తాజాగా నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో సీఎం ప్రసంగించారు. తలకాయలో గుజ్జు ఉన్న వారు.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం పైశాచిక ఆనందం.. వెకిలి చేష్టలు ఎక్కువ అయ్యాయి.. అంత అసహనం ఎందుకు? అని ప్రశ్నించారు. “ఎవరిది డ్రగ్స్ కల్చర్.. ఇవాళ గల్లి గల్లి డ్రగ్స్.. గంజాయి దందాలు ఉన్నాయి. ఎవరు…
Vivek Venkataswamy: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని B1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన సాగించారని వివేక్ ఆరోపించారు. తెలంగాణను 60 వేల కోట్ల అప్పుల నుంచి 8 లక్షల…
CM Revanth Reddy : శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ విద్యాసంస్థకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసభలో మాట్లాడుతూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “కొల్లాపూర్ సెగ్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని ప్రకటించిన సీఎం రేవంత్, పాలమూరు ప్రజలు దేశంలో ప్రతిభతో నిలుస్తారని గుర్తు…
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు.
Kasam Venkateswarlu: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు విఫలం అయ్యాయని అయ్యన అన్నారు. బనకచర్లపై సరైన సమయంలో కావాల్సిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. బనకచర్లపై CWC అనుమతి తప్పనిసరి ఉంటుంది. అలాగే బనకచర్ల అంశంలో…
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేనిదిగా బీజేపీ గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కూడా సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీబీఐ విచారణపై మొహం మార్చుకుందని వ్యాఖ్యానించారు. Read Also: Manchu Vishnu: రజనీకాంత్…
MP Balram Naik: ములుగు జిల్లాలో జరిగిన ఇంద్ర మహిళ పట్టాల పంపిణీ కార్యక్రమం సభ రాజకీయ వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ములుగు ఎంపీ బలరాం నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని నా పరిధిలో ఉన్న రెండు మండలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీతక్కదే అని స్పష్టం చేశారు.…
మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు... చాలా అనుభవజ్ఞులు" అని జగ్గారెడ్డి అన్నారు. కానీ.. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి…
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఉరితీసిన తప్పులేదని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినా.. రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారని స్పష్టం అవుతుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగాలని కేసీఆర్ అంటున్నారని..
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలన్ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. టైం వేదిక మీరే డిసైడ్ చేయండి.. చర్చకు ఎక్కడికి రమ్మన వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్? అంటూ సవాల్ విసిరారు. రజతోత్సవ సభలో…