Laila Movie : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఫుల్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంతే కాకుండా ఓ సినిమా సెట్ మీద ఉండగానే మరిన్ని చిత్రాలు లైన్ లో పెడుతున్నారు. కొత్త తరహా కథల్లో నటిస్తూ యూత్ కు బాగా దగ్గరైన విశ్వక్ సేన్.. ఇప్పుడు లైలా మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. కెరీర్లో ఫస్ట్ టైం అమ్మాయిగా నటిస్తున్నారు విశ్వక్. అమ్మాయి, అబ్బాయిగా రెండు రోల్స్ లో విశ్వక్ నటిస్తున్న లైలా మూవీని రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్ ఎమ్ టీ అర్చన ప్రెజెంట్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. లైలా మూవీతోనే ఆమె.. టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.
Read Also:Borewell Incident: 16 గంటల రెస్య్కూ విఫలం.. బోరుబావిలో పడిన బాలుడు మృతి..
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉంది. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే అనౌన్స్ చేసినట్లు ఆదివారం ఉదయం లైలా ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ సాంగ్ ను విడుదల చేశారు. సోనూ మోడల్ వైబ్ ఆంథమ్ పేరుతో ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. సాధారణంగా మేకర్స్.. సినిమా రిలీజ్ తర్వాత ఫుల్ వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తుంటారు. కానీ లైలా మేకర్స్ ముందే రివీల్ చేసేశారు.
Read Also:Jailer 2 : తూచ్ అంతా ఉత్తిదే.. జైలర్ 2 ఆ బ్యూటీ లేదట
లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన సోనూ మోడల్ సాంగ్ ను నారాయణ్ రవిశంకర్, రేష్మా శ్యామ్ పాడారు. మరో విశేషం ఏంటంటే ఈ సాంగ్ కు విశ్వక్ సేన్ లిరిక్స్ అందించారు. లిరిక్స్ చాలా క్రేజీగా ఉన్నాయనే చెప్పాలి. మ్యూజిక్ కూడా ట్రెండీగా ఉంది. మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అదే సమయంలో విశ్వక్ సేన్ డ్యాన్స్ ఇరగదీశాడు. వేరే లెవెల్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఆయన వేసుకున్న అవుట్ ఫిట్స్.. అన్నీ ట్రెండీగా, క్రేజీగా ఉన్నాయి. ఆకాంక్ష శర్మ.. తన గ్లామరస్ లుక్స్ తో అట్రాక్ట్ చేశారు.