మిచౌంగ్ తుఫాన్ దెబ్బకు తమిళనాడు లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.చెన్నై నగరం మొత్తం అస్తవస్తంగా మారిపోయింది. వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది.భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం అంతా వణికిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. ఇప్పటికే ఎనిమిది మందికి పైగా మరణించినట్లు సమాచారం.చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం కలిగింది. నగరాలన్ని కూడా నీటితో నిండిపోవడంతో రోడ్ల పై ఉన్న కార్లు కూడా నీళ్లలో కొట్టుకుపోయాయి. చాలా మంది నివాసాల్లో నీరు చేరడంతో పాములు వంటి విష ప్రాణులు కూడా వస్తుండటంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు.అధికారులు పలు ప్రధాన నగరాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. చాలా మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వరద నీటిలో నానా తంటాలు పడుతున్నారు.
మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ , ఎస్డిఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి..వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడి వారికీ ఆహారం అందిస్తున్నారు.ఈ క్రమంలో విష్ణు విశాల్ చేసిన ట్వీట్ ఎంతో వైరల్‌గా మారింది.తాను నివాసం ఉండే ప్రాంతంలోని పరిస్థితిని వివరిస్తూ హీరో విష్ణు విశాల్ పోస్ట్ చేసారు.విష్ణు విశాల్ కూడా వరదల్లో చిక్కుకున్నారు. కారప్పాకంలోని తమ నివాసంలో నీరు చేరిందని విష్ణు విశాల్ తెలిపాడు. ఇంట్లోకి వరద నీరు రావడంతో విష్ణు విశాల్ ఇంటి పైకి ఎక్కాడు. అక్కడి నుంచి ఓ ఫోటోను షేర్ చేశాడు. తనకు విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదని..ఇంట్లోకి నీరు రావడంతో సిగ్నల్ కూడా దొరక్క ఇంటి పైకి వచ్చాను అని సిగ్నల్ రాగానే ఈ పోస్ట్ షేర్ చేశాను అని తెలిపాడు విష్ణు విశాల్..ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే ఫైర్, రెస్క్యూ విభాగాలు స్పందించాయి. కారప్పాకం ఏరియాలో సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ విషయాన్ని విష్ణు విశాల్ తాజాగా మరో పోస్ట్ ద్వారా తెలియజేస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో ఆదుకుందని ప్రశంసించారు. రెస్క్యూ టీమ్‌తో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ కూడా కనిపించారు.