మిచౌంగ్ తుఫాన్ దెబ్బకు తమిళనాడు లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.చెన్నై నగరం మొత్తం అస్తవస్తంగా మారిపోయింది. వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది.భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం అంతా వణికిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. ఇప్పటికే ఎనిమిది మందికి పైగా మరణించినట్లు సమాచారం.చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం కలిగింది. నగరాలన్ని కూడా నీటితో నిండిపోవడంతో రోడ్ల పై ఉన్న కార్లు కూడా నీళ్లలో కొట్టుకుపోయాయి.…