విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శివారు ప్రాంతంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘటన మేఘద్రి గెడ్డ సమీపంలో చోటు చేసుకుంది. యువకుడిని మద్యం సీసాలతో కిరాతకంగా పొడిచి, మొఖాన్ని ఛిద్రం చేసి పరారయ్యారు నిందితులు. ఆదివారం రాత్రి మేఘద్రి గెడ్డ వద్ద కొంతమంది యువకులు మందు పార్టీ చేసుకున్నట్లు తెలుస్తుంది.
Also Read: Abhishek Sharma: అదేం బ్యాటింగ్‌రా సామీ.. 10 బంతుల్లోనే 50 రన్స్ చేస్తాడు!
సంఘఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు కళ్యాణ్ చక్రవర్తి (25)గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.