Visakhapatnam: మహిళ.. ఇద్దరితో ఈ బంధాన్ని మెయింటేన్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మహిళ ఓ వ్యక్తి.. మరో వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో జరిగింది. ఒక్కసారిగా కత్తిపోట్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రైల్వే ఉద్యోగి మీద ఈ దాడి జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత ఎవరో దోపిడీ దొంగలు డబ్బులు, బంగారం కోసం దాడి చేశారనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.
READ MORE: UGC: 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించిన UGC.. లిస్ట్ ఇదిగో
విజయనగరానికి చెందిన గౌరినాయుడు, దొండపర్తికి చెందిన ఏనుగుల నాగరాజు ఇద్దరు రైల్వే ఉద్యోగులు. నిజానికి ఇద్దరు మంచి స్నేహితులే. కానీ వీరిద్దరి మధ్య ఓ మహిళ చిచ్చు పెట్టింది. అదే రైల్వే డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళతో గౌరీ నాయుడికి వివాహేతర సంబంధం ఉంది. అయితే అదే మహిళ.. నాగరాజుతోనూ వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనతో రిలేషన్‌లో ఉంటూనే గౌరీ నాయుడితో సంబంధం పెట్టుకోవడం నాగరాజుకు నచ్చలేదు..
READ MORE: Lovers Suicide: ప్రేమ పెళ్లి.. కలిసి బతకలేక ప్రేమ జంట ఆత్మహత్య..
అయితే కొన్ని రోజుల నుంచి నాగరాజుకు అనుమానం ఉండేది. ఒక రోజు కన్ఫమ్ చేసుకోవడానికి ప్లాన్ వేశాడు. ఆ మహిళ ఇంటికి గౌరీ నాయుడు వెళ్లడం సీక్రెట్‌గా గమనించి ఫాలో అయ్యాడు. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరిని పట్టుకుని నిలదీశాడు. ఎందుకు ఇలా చేశావని మహిళను ప్రశ్నించాడు. ఇన్నాళ్లు తనతో రిలేషన్‌లో ఉండి ఇప్పుడు గౌరీ నాయుడుతో సంబంధం పెట్టుకోవడం ఏంటని ఆగ్రహంతో ఊగి పోయాడు నాగరాజు. ఆ ఇంట్లో వారి ముగ్గురికి వాగ్వాదం జరిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో నాగరాజు దాడికి దిగాడు. దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు గౌరీ నాయుడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళకు కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు పాలైన గౌరీనాయుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. గౌరినాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే వివాదానికి దారితీసి దాడి జరిగినట్లు తెలిపారు.. మొత్తానికి ఇద్దరు వ్యక్తులతో ఏకకాలంలో వివాహేతర బంధం పెట్టుకున్న మహిళను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..